మహానాడు పేరు తీసేసి “పప్పు డప్పు” అని పెట్టాలి

టిడిపి నిర్వహిస్తున్న మహానాడుపై మరోసారి వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. మహానాడు పేరు తీసేసి “నారా నేడు” లేదా “పప్పు డప్పు” అని పెట్టుకో సరిపోతుందని ఎద్దేవా చేశారు. “వైఎస్సార్ పంటల బీమా పథకంపై పడి ఏడుస్తాడు. రైతు భరోసా కింద డబ్బులిస్తే కేంద్ర నిధులంటాడు. కేంద్ర నిధులైతే అన్ని రాష్ట్రాల్లో ఉండాలిగా చంద్రబాబూ? మహానాడులో అబద్ధాలు ప్రచారం చెయ్యడానికి సిగ్గులేదూ ? మహానాడు పేరు తీసేసి “నారా నేడు” లేదా “పప్పు డప్పు” అని పెట్టుకో సరిపోతుంది.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు ముందు ట్వీట్ లో ఓటుకు నోటు కేసుపై కామెంట్ చేశారు విజయసాయిరెడ్డి. “మనవాళ్ళు ‘బ్రీఫ్డ్ మీ’ వాయిస్ పెద్ద పచ్చ ఫంగస్ దే అని ED కూడా తేల్చేసింది. అడ్డంగా దోచుకున్న డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడం బాబుకు ‘వెన్నుపోటు’తో పెట్టిన విద్య. 23మంది వైస్సార్సీపీ ఎమ్మెల్యేలను అలానే కొన్నాడు. చేసిన పాపాలు ఊరికేపోవు. ఇక దేభ్యం ముఖం వేసుకుని దిక్కులు చూడ్డమే బాబు పని.” అని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-