ఆ విషయంలో విజయ్ దేవరకొండ తోపు!

మనం పుట్టిన ఊరు గురించి, మన సంస్కృతి, సంప్రదాయల గురించి ఏ స్థాయికి చేరుకున్నా పట్టించుకోవాలి. అలాంటి పని స్టార్స్ చేసినప్పుడు ఆ ప్రాంతానికి, ఆ సంస్కృతికి మరింత విలువ పెరుగుతుంది. ఈ విషయంలో విజయ్ దేవరకొండ తోపు అనే చెప్పాలి. ఆ మధ్య నల్లమల అడవుల్లో యురేనియం కోసం త్రవ్వకాలు జరుపబోతున్నారని తెలిసి తన నిరసన గళం విప్పిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా కల్పించడం కోసం కృషి చేస్తున్నాడు. ‘కాకతీయ రాజవంశం నిర్మించిన 800 సంవత్సరాల పురాతన రామప్ప ఆలయం ఇప్పుడు ప్రపంచ వారసత్వ హోదా కోసం పందెంలో ఉంది’ అంటూ విజయ్ దేవరకొండ తన అభిమానులను, నెటిజన్లను ఉత్తేజ పరిచాడు.

read also : చివరి షెడ్యూల్ లో ‘అఖండ’

కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఈ విషయంలో చాలా కృషి చేస్తోంది. ప్రపంచ వారసత్వ కమిటీకి భారతదేశం నుండి రామప్ప దేవాలయంను నామినేట్ చేశారని, ఈ నెల 24 నుండి 26 మధ్య దానిని బలపరుస్తూ ఓటు వేయమని ఈ సంస్థ కోరుతోంది. రాష్ట్రమంత్రి కేటిఆర్ తో పాటు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి మీనాక్షి లేఖిని, యునెస్కోనూ ట్యాగ్ చేస్తూ ఈ సంస్థ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీన్ని విజయ్ దేవరకొండ రీ ట్వీట్ చేశాడు. చారిత్రాత్మక విషయాలను విజయ్ దేవరకొండ స్వయంగా పట్టించుకోవడమే కాకుండా… తన అభిమానులను పట్టించుకోమని కోరడం విశేషమే. అయితే… విజయ్ దేవరకొండ మనసులోని గొప్ప ఆలోచనలను అభినందిస్తూనే చాలామంది నెటిజన్లు ‘లైగర్’ అప్ డేట్స్ ఇవ్వమంటూ మొత్తుకుంటున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-