‘లాభం’ సెన్సార్ పూర్తి! 9న గ్రాండ్ రిలీజ్!!

విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలవుతుంది. జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఎస్‌.పి.జననాథన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్నిబత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) తెలుగులో విడుద‌ల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”మా ‘లాభం’ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా విడుదల చేయాలని అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే సెన్సార్ కార్యక్రమాలనూ జరిపాం. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు అభినందించడంతో పాటు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ను ఇచ్చారు. దీంతో ఓ మంచి సినిమాను మా బ్యాన‌ర్‌లో ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నందుకు గ‌ర్వంగా అనిపించింది. విజయ్ సేతుపతి ఇందులో డిఫరెంట్ పాత్రలో, లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూసి ఎంజాయ్ చేసేలా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో డైరెక్ట‌ర్ ఎస్‌. పి.జ‌న‌నాథ‌న్ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌లు ఢీ అంటే ఢీ అనేలా ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేస్తాయి” అని అన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-