వివాదాస్పద వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి ?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ వివాదాస్పద వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడట. అమెజాన్ ప్రైమ్ సిరీస్ రూపొందించబోయే ఈ సిరీస్ కోసం ఆయనను ఇప్పటికే మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ది ఫ్యామిలీ మ్యాన్-2” ట్రైలర్ తోనే వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇందులో సమంత అక్కినేని నటించిన రాజి పాత్రకు తమిళుల నుంచి భారీ నెగెటివిటీ వచ్చింది. ఆ తరువాత ప్రశంసలు కూడా వచ్చాయనుకోండి. ఇక మేకర్స్ “ది ఫ్యామిలీ మ్యాన్-3” కోసం విజయ్ సేతుపతితో చర్చలు జరిపినట్టు సమాచారం.

Also Read : బ్లాక్ అండ్ బ్లాక్ లో తండ్రితో చరణ్… పిక్ వైరల్

నిజానికి ముందుగా “ది ఫ్యామిలీ మ్యాన్-2″లో ఎల్‌టిటిఇ చీఫ్ పాత్ర కోసం విజయ్ ని అడిగారట మేకర్స్. కానీ తెలియని కారణాల వల్ల విజయ్ ఈ పాత్రను అంగీకరించలేదు. అతను ఆ పాత్రకు ప్రముఖ తమిళ నటుడు మైమ్ గోపి పేరును సిఫారసు చేశాడు. తాజా సమాచారం ప్రకారం “ది ఫ్యామిలీ మ్యాన్-3″లో విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నారట. ఈ వెబ్ సిరీస్ సృష్టికర్తలు రాజ్, డికె ద్వయం ఇప్పటికే కథ, ఆయన పాత్ర గురించి విజయ్ సేతుపతితో చర్చించారని తెలుస్తోంది. అయన దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-