ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న విజయ్ సేతుపతి ‘వ్యవసాయం కథ’

మొత్తం దేశంలోనే కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు కూడా కొనసాగుతోంది. చెన్నై సహా రాష్ట్రమంతటా స్ట్రిక్ట్ లాక్ డౌన్ విధించారు. మరి ఇటువంటి సమయంలో సినిమా కష్టాలకు కొదవుంటుందా? కోలీవుడ్ లో చాలా సినిమా థియేటర్లు లేక రిలీజ్ అవ్వటం లేదు. అంతకంటే ఎక్కువ సినిమాలు ప్రొడక్షన్ దశలో, పోస్ట్ ప్రొడక్షన్ దశలో నిలిచిపోయాయి. అందుకే, అన్ని విధాల తమ సినిమాలు పూర్తైన దర్శకనిర్మాతలు ఓటీటీ వేదికలకు జై కొడుతున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు విజయ్ సేతుపతి స్టారర్ ‘కడైసీ వ్యవసాయి’ కూడా చేరిపోయింది. ‘కడైసీ వ్యవసాయి’ అంటే చివరి రైతు అని అర్థం! వ్యవసాయం నేపథ్యంలో సాగే ఈ సినిమా త్వరలో సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. లాక్ డౌన్ వల్ల థియేట్రికల్ రిలీజ్ ఇప్పుడప్పుడే సాధ్యం కాదని క్లారిటీ వచ్చేయటంతో ఫిల్మ్ మేకర్స్ డిజిటల్ బాట పట్టారు. గతంలో ‘కాక ముట్టై’ లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమా తీసిన దర్శకుడు మణికందన్ ‘కడైసీ వ్యవసాయి’ చిత్రాన్ని రూపొందించాడు. మాస్ట్రో ఇళయరాజా బాణీలు సమకూర్చాడు. అలాగే, విజయ్ సేతుపతితో పాటూ సినిమాలో కమెడియన్ యోగి బాబు కీలక పాత్ర పోషించాడని సమాచారం. చూడాలి మరి, ఆన్ లైన్ వేదికపై విజయ్ సేతుపతి నెక్ట్స్ మూవీ ఆడియన్స్ ని ఎలా ఎంటర్టైన్ చేస్తుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-