బాబీ విడుదల చేసిన విజయ్ సేతుపతి ‘లాభం’ ఫస్ట్ లుక్

విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన సినిమా ‘లాభం’. యస్.పి. జననాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు మెయిన్ విలన్ గా నటించగా సాయి ధన్సిక కీలక పాత్రలో కనిపించనున్నారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘లాభం’ తెలుగు వెర్షన్‌కి సంబంధించి ఫస్ట్ లుక్ ను దర్శకుడు బాబీ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ వేడుకలో రచయిత కోన వెంకట్, మైత్రీ అధినేతలు నవీన్ ఎర్నేని, రవి పాల్గొన్నారు. తెలుగు వెర్షన్‌ ను శ్రీగాయత్రి దేవీ ఫిలమ్స్ పతాకంపై బత్తుల సత్యనారాయణ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి రైతు సమస్యలపై పోరాడే యువకునిగా కనిపించనున్నారు. ఈ సినిమాకు లాయర్ శ్రీరామ్ సమర్పకులు కాగా హరీశ్ బాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-