విజయ్ కుమార్ మనవరాలు వెండితెరపై మెరువబోతోందా!?

సీనియర్ నటుడు విజయ్ కుమార్ వివిధ భాషల్లో 400లకు పైగా చిత్రాలలో నటించారు. అంతే కాదు ఆయన పిల్లలంతా సినిమాల్లో యాక్ట్ చేశారు. విజయ్ కుమార్ మొదటి భార్య ముత్తుకన్నుకు ముగ్గురు పిల్లలు. అనిత, కవిత, అరుణ్‌ విజయ్. అందులో అరుణ్ విజయ్ ఇప్పుడు కోలీవుడ్ లో పాపులర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక విజయ్ కుమార్ రెండో భార్య నటి మంజుల గురించి అందరికీ తెలిసిందే. దక్షిణాది చిత్రాలలో గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది మంజుల. ఆమెకు వనిత, ప్రీతి, శ్రీదేవి ముగ్గురు కూతుళ్ళు. విశేషం ఏమంటే ఈ ముగ్గురూ కూడా తెలుగు సినిమాల్లో కథానాయికలుగా నటించారు. విజయ కుమార్ పిల్లల్లో అసలు సినిమాల్లో నటించని వ్యక్తి ఒక్కరే ఒకరు. ఆమె అనిత. డాక్టర్ గోకుల్ కృష్ణన్ ను వివాహం చేసుకున్న అనితకు ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ప్రస్తుతం అనిత కుమార్తె దియా లండన్ లో వైద్య విద్యను అభ్యసిస్తోంది. సినిమాల్లో ఉన్న తండ్రితోనూ, తమ్ముడితోనూ చక్కని అనుబంధం ఉన్న అనిత తన కుమార్తెను నటిని చేసే అవకాశం లేకపోలేదని కోలీవుడ్ మీడియా అంటోంది. మరి డాక్టర్ చదువుతున్న దియా మనసులో ఏముందో తెలియదు. ఏదేమైనా మనవరాలికి సినిమా రంగం పట్ల ఆసక్తి ఉంటే విజయ్ కుమార్ తప్పకుండా స్వాగతిస్తాడని, అలానే మేనమామ అరుణ్ సహకారమూ దియాకు ఉంటుందని అంటున్నారు. ఈ మెడికో… నటిగా మారుతుందో లేదో చూడాలి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-