స్టార్స్ కు కరోనా కష్టాలు స్టార్ట్… మళ్ళీ షూటింగ్ క్యాన్సిల్

కరోనా మహమ్మారి మరోసారి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు థర్డ్ వేవ్ భయాందోళనలను సృష్టిస్తున్నాయి. ఒకవైపు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మహేష్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, విశ్వక్ సేన్, నితిన్ వైఫ్ షాలిని, తాజాగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కు కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా మొదలైనప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితులే మరోమారు ఇండస్ట్రీలో స్టార్ట్ అవుతోంది. గతంలో కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడడమే కాకుండా షూటింగులు సైతం ఆగిపోయాయి. ఇక చాలా సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదు. తాజాగా మళ్ళీ అదే పరిస్థితి ఎదురు కాబోతోంది.

Read Also : మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్… తగ్గిన టికెట్ ధరలు

‘లైగర్’ విజయ్ దేవరకొండ కూడా తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన పెంపుడు కుక్కతో కలిస్ ఉన్న పిక్ ను షేర్ చేస్తూ “స్పష్టంగా మరొక తుఫాను. షూటింగ్ రద్దు అయ్యింది” అంటూ కోవిడ్-19 కారణంగా ‘లైగర్’ షూట్ క్యాన్సిల్ అయ్యిందనే విషయాన్ని వెల్లడించారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ. ఈ సినిమాను కన్నడ, తమిళ, మలయాళంలో కూడా డబ్ చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్, అనన్యతో పాటు ‘లైగర్’ రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్‌పాండే కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 25న ఈ పాన్ ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Related Articles

Latest Articles