లెక్కల మాస్టర్ కి ‘లైగర్’ స్పెషల్ విషెస్..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ నేడు తన 52 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇక నేడు సుకుమార్ బర్త్ డే విషెస్ తో ట్విట్టర్ మారుమ్రోగిపోయింది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సుకుమార్ కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే ఆయనాతో కలిసి పనిచేసిన రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ వంటి హీరోలు లెక్కల మాస్టర్ కి తమదైన రీతిలో శుభాకాంక్షలు తెలుపగా.. ఇకముందు పనిచేసే హీరో విజయ్ దేవరకొండ అంతే స్పెషల్ గా సుకుమార్ కి బర్త్ డే విషెస్ ని తెలిపారు. వీరిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప ది రూల్ తర్వాత, సుకుమార్ విజయ్ తో సినిమా మొదలు పెట్టనున్నారు. అప్పటిలోగా విజయ్ లైగర్ షూటింగ్ ని పూర్తి చేయనున్నాడు. ఇక ఈ విషయాన్ని కూడా విజయ్ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.

“సుకుమార్ సార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. మీతో సినిమా చేయడానికి ఎదురు చూడలేకపోతున్నాను..  2021 లో ది రైజ్, 2022 లో ది రూల్, 2023 లో ది ర్యాంపేజ్ ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ర్యాంపేజ్ కథతో విజయ్ ని ఏ రేంజ్ లో చూపించనున్నాడో అని అభిమానులు యితఁహో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Latest Articles