విదేశాల్లో ప్లాన్‌ చేసిన.. లోకల్ లోనే సెట్‌ వేశారు!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ కరోనా వేవ్ కారణంగా వాయిదా పడింది. కాగా, త్వరలోనే హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే మొదట విదేశాల్లో ప్లాన్‌ చేసిన ఈ షెడ్యూల్‌ కరోనా వేవ్ తో అంత తారుమారు అయింది. దీంతో హైదరాబాద్‌లోనే అదిరిపోయే సెట్ వేశారనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం విదేశాల్లో పరిస్థితులు బాగా లేకపోవడంతో ‘లైగర్’ చిత్రబృందం హైదరాబాద్ లోనే షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-