రోజు రోజుకూ పెరుగుతున్న ‘లైగర్’ క్రేజ్!

టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘లైగర్’కు సూపర్ క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఏకంగా రెండు మిలియన్ లైక్స్ ను సంపాదించుకున్న తొలి దక్షిణాది చిత్రంగా నిలవడం విశేషం. ఇదిలాఉంటే ‘లైగర్’ డైరెక్ట్ ఓటీటీ ఆఫర్ సైతం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజా సమాచారం ప్రకారం డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అండ్ ఆల్ లాంగ్వేజ్ శాటిలైట్ రైట్స్ కు ఓ ప్రముఖ సంస్థ ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలను ఆఫర్ చేసిందట.

Read Also : ”నేను చెడ్డ అమ్మాయినా?”… ప్రశ్నిస్తోన్న ప్రియాంక చోప్రా!

విజయ్ దేవరకొండకు ఇదే ఫస్ట్ స్ట్రయిట్ హిందీ మూవీ. అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం గతంలో రెండు హిందీ సినిమాలు డైరెక్ట్ చేశాడు. పూరి లేటెస్ట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ భారీ విజయాన్ని అందుకోవడం, విజయ్ దేవరకొండకు ఉత్తరాదిన సైతం భారీగా అభిమానులు ఉండటం, ఈ మూవీకి కరణ్‌ జోహార్ వంటి స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ నిర్మాణ భాగస్వామి కావడం ఇవన్నీ కూడా ‘లైగర్’కు ఇంత హైప్ రావడానికి కారణమని తెలుస్తోంది. అనన్యపాండే నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే డైరెక్ట్ ఓటీటీ ఆఫర్ పై నిర్మాతలు ఇంకా తుదినిర్ణయం ఏదీ తీసుకోలేదని తెలుస్తోంది.

-Advertisement-రోజు రోజుకూ పెరుగుతున్న 'లైగర్' క్రేజ్!

Related Articles

Latest Articles