‘లయన్’ విత్ ‘లైగర్’.. చూడడానికి రెండు కళ్లు చాలడం లేదే

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘అన్ స్టాపబుల్’.. ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఎంతటి ప్రజాదరణ పొందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. స్టార్ల కబుర్లు, బాలయ్య పంచులతో ప్రతి శుక్రవారం సందడి సందడిగా సాగుతోంది. ఇక ఇప్పటికే 10 ఎపిసోడ్లతో ఈ సీజన్ ముగియనున్నదని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చివరి గెస్ట్ గా మహేష్ బాబు రానుండగా.. 9 వ ఎపిసోడ్ కి ‘లైగర్’ సందడి చేయనున్నాడు.

విజయ్ దేవరకొండ ‘అన్ స్టాపబుల్’ షో కి గెస్ట్ గా రానున్నాడు అనే వార్తలు గుప్పుమన్నవే తప్ప అఫీషియల్ గా మేకర్స్ ప్రకటించింది లేదు. ప్రస్తుతం 8 వ ఎపిసోడ్ లో బాలయ్య తో రానా సందడి చేయనున్నాడు. ఇక ఈ ఎపిసోడ్ రేపు శుక్రవాదం స్త్ర్రీమింగ్ కానుంది. ఇకపోతే దీని తరువాత ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. సెట్ లో విజయ్ దేవరకొండ, బాలయ్య కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. విజయ్ తో పాటు లైగర్ నిర్మాత, హీరోయిన్ ఛార్మి కూడా పాల్గొన్నది. ఇక ఈ షో లో బాలయ్య పంచెకట్టుతో కనిపించడంతో సంక్రాంతికి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రౌడీ హీరోను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేసి ఆటపట్టించాడో చూడాలంటే ప్రోమో వచ్చేవరకు ఆగాల్సిందే.

Related Articles

Latest Articles