మెగాస్టార్‌కు మద్దతు ప్రకటించిన విజయ్ దేవరకొండ

తెలుగు సినీ పరిశ్రమ మేలు కోసం, థియేటర్ల మనుగడ కోసం తాను సీఎం జగన్‌ను కలిసి చర్చిస్తే తనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేశారంటూ కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు GiveNewsNotViews అంటూ ఓ హ్యాగ్‌ ట్యాగ్‌ను చిరంజీవి తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ మై ఫుల్ సపోర్ట్ అంటూ చిరంజీవికి మద్దతు తెలుపుతూ ఓ ట్వీట్ చేశాడు.

Read Also: ఇది సార్ అల్లు అర్జున్ బ్రాండ్.. ‘సౌత్ కా సుల్తాన్’

GiveNewsNotViews ఉద్యమానికి తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానంటూ విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు. గతంలో విజయ్ దేవరకొండ తనపై నిరాధారమైన వార్తలు ప్రసారం చేసిన ఓ వెబ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సమయంలో అతడికి మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. చిరంజీవి మాత్రమే కాదు… ఇండస్ట్రీలో పలువురు హీరోలు విజయ్ దేవరకొండకు తమ మద్దతు తెలిపారు.

Related Articles

Latest Articles