నా కెరీర్ మొదలైన దర్శకుడి సినిమా.. నా థియేటర్ లో: విజయ్ దేవరకొండ

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటుగా బిసినెస్ లోను రాణిస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ స్టార్ట్ చేసి, సూపర్ బ్రాండ్‌గా మార్చుకున్నాడు. ఇప్పుడు మల్టిఫ్లెక్స్ బిజినెస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తన స్వస్థలమైన మహాబూబ్‌నగర్‌లో ఈ మల్టీప్లెక్స్‌ థియేటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు విజయ్ దేవరకొండ. మల్టీప్లెక్స్‌కు ఏవిడి సినిమాస్ అని పేరు పెట్టారు.

ఈ థియేటర్‌లో ఫస్ట్ సినిమాగా లవ్ స్టోరీ సెప్టెంబర్ 24వ తేదీన రాబోతుందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నా కెరీర్ మొదలైంది శేఖర్ కమ్ముల గారి సినిమాతోనే.. ఇప్పుడు ఆయన సినిమా నా థియేటర్లో వస్తున్నందుకు ఆనందంగా వుంది’ అంటూ విజయ్ తెలిపారు. ప్రస్తుతం విజయ్, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ చేస్తున్నాడు. ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్నారు.

-Advertisement-నా కెరీర్ మొదలైన దర్శకుడి సినిమా.. నా థియేటర్ లో: విజయ్ దేవరకొండ

Related Articles

Latest Articles