రౌడీ హీరోగారి నయా లుక్ అదిరిందిగా..

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ వేర్ పేరుతో విజయ్ ఒక బ్రాండ్ దుస్తులను అమ్ముతున్న విషయం విదితమే. ఈ రౌడీ బ్రాండ్ కి అభిమానుల్లోనే కాదు స్టార్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ దుస్తులకు పడిపోయిన వారిలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఇకపోతే ఎప్పటికప్పుడు వైరైటీ వైరైటీ కలెక్షన్స్ తో ముంచుకు వచ్చే మన రౌడీ హీరో ఈసారి కొత్త కలెక్షన్ తో సిద్దమైపోయాడు. అయితే ఈసారి రౌడీ వేర్ లుక్ సింపుల్ గా, ట్రెండీ గా ఉండడం గమనార్హం. రౌడీ సీజన్ 2022 అంటూ విజయ్ తన బ్రాండ్ ని ప్రమోట్ చేశాడు.

ఇక చలికాలం కావడంతో రౌడీ హూడీస్ తో ప్రత్యక్షమైపోయాడు విజయ్ దేవరకొండ. హుడీ వెనుక రౌడీ బ్రాండ్ తో ఉన్న ఈ డిజైనర్ డ్రెస్ లు ప్రస్తుతం కుర్రాళ్లకు ఫెవరెట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ హుడీస్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఏది ఏమైనా ఈ డ్రెస్ లో రౌడీ గారి లుక్ అదిరిందని చెప్పాలి. లైగర్ కోసం బీస్ట్ మోడ్ లోకి వెళ్లిన విజయ్ దేవరకొండ ఈ హుడీలో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. దీంతో ప్రస్తుతము ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Latest Articles