షణ్ముఖ ప్రియకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్

ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనల్స్ సందర్భంగా ఫైనల్స్ కి చేరిన తెలుగమ్మాయి షణ్ముక ప్రియకు విజయ్ దేరకొండ తన సినిమాలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు విజయ్. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా ‘లైగర్‌’లో షణ్ముఖ ప్రియ కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్ కు తనిష్క్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. షణ్ముఖ ప్రియ ఆమె తల్లి హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళగా… ఫైనల్ మిక్సింగ్ పూర్తయిన వెంటనే షణ్ముక ప్రియ పాడిన పాట వినవచ్చని కూడా చెప్పాడట.

అంతే కాదు విజయ్ మదర్ సింగర్ షణ్ముక ప్రియను సన్మానించి చీరలు, బహుమతులను అందజేశారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం ‘లైగర్’లో అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమా చివరి షెడ్యూల్ త్వరలో గోవాలో ప్రారంభం కానుంది.

షణ్ముఖ ప్రియకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్

షణ్ముఖ ప్రియకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్

Related Articles

Latest Articles

-Advertisement-