విడాకులకు వస్త్రధారణే కారణమైతే.. సంప్రదాయ దుస్తులతో ఆనందంగా ఉన్నారా?

హాస్యనటి విద్యుల్లేఖ రామన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్, కోలీవుడ్ లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది తన స్నేహితుడి సంజయ్‌తో ఎంగేజ్మెంట్ జరగ్గా, రీసెంట్ గా వీరి వివాహం జరిగింది.. ప్రస్తుతం ఈ జంట హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లి, అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే, తాజాగా విద్యుల్లేఖ బికినీలో బీచ్‌లో దిగిన ఫొటోను షేర్‌ చేసింది. దీనిపై కొందరు నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌ను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. అంతేకాదు, ‘విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు’ అని అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయడంతో ఆమె ఘాటుగా రిప్లై ఇచ్చింది. ‘1920 నాటి కాలాన్ని వదిలి 2021కు రండి.. ఒక మహిళ వస్త్రధారణే విడాకులకు కారణమైతే సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలందరూ వారి వైవాహిక జీవితాల్లో ఆనందంగా ఉన్నారా? అంటూ ప్రశ్నించింది. సమస్య నెగెటివ్‌ కామెంట్స్‌ వల్ల కాదు. సమాజం ఆలోచించే తీరును బట్టి ఉంటుంది’ అని విద్యుల్లేఖ స్పందించింది.

Vidyullekha Raman slim look in bikini
-Advertisement-విడాకులకు వస్త్రధారణే కారణమైతే.. సంప్రదాయ దుస్తులతో ఆనందంగా ఉన్నారా?

Related Articles

Latest Articles