నెటిజన్ కు విద్యాబాలన్ ఎపిక్ రిప్లై..!

బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎపిక్ రిప్లై ఇచ్చి తన అభిమానులను ఫిదా చేసేసింది. సోమవారం విద్యాబాలన్ తన అభిమానులు మరియు అనుచరులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటరాక్ట్ అయ్యారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది. కొందరు ఆమెకు ఇష్టమైన వంటకం, పెర్ఫ్యూమ్, వెబ్ సిరీస్ గురించి అడగ్గా… ఒక అభిమాని ఆమెను సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలని అడిగారు. దీనికి ప్రతిస్పందనగా విద్యాబాలన్ తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో సంతోషంగా ఉన్న చిత్రాన్ని పంచుకుంటూ “నా SRK” అని రిప్లై ఇచ్చారు. ఇక జూన్ 2న విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “షెర్ని” ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం జూన్ 18 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల కానుంది. అమిత్ మసూర్కర్ నేతృత్వంలో, టి-సిరీస్, అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో విద్యా బాలన్ అటవీ అధికారి పాత్రను పోషిస్తున్నారు. షెర్నితో పాటు విద్యాబాలన్ 2021 లో “మహాభారతం 2″లో కూడా కనిపిస్తుంది. ఈ నటి చివరిసారిగా “మిషన్ మంగళ్”, “శకుంతల దేవి” చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

Image
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-