నా పోరాటం శ్రీకాకుళం నుంచే..

త్వరలో ప్రారంభంకానున్న బస్సు యాత్ర షెడ్యూల్ గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెదవి విప్పారు.. ఇవాళ విశాఖలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం హామీల అమలు, స్థానిక సమస్యల పరిష్కారానికి ఈ నెల 20 నుంచి జనసేన పోరాట యాత్ర ప్రారంభిస్తానని.. శ్రీకాకుళం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు.. ఇచ్చాపురం తీర ప్రాంతంలో గంగపూజ చేసి ఈ యాత్రను ప్రారంభించి.. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని సుమారు 45 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని చెప్పారు.