దాచేపల్లి బాధితురాలికి సీఎం పరామర్శ

ఆంధ్రప్రదేశ్‌లో దాచేపల్లి ఘటన సంచలనం సృష్టించింది… బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నా ఉద్రిక్తతలు ఆగని పరిస్థితి… అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని పరామర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు… గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న ఏపీ సీఎం… బాధితురాలు చికిత్సపొందుతున్న వార్డుకు వెళ్లి పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. ఈ ఘటన వెలుగుచూడగానే సీరియస్‌గా స్పందించిన చంద్రబాబు… బాధితురాలికి అండగా ఉండాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.