దృశ్యం-2 ట్రైలర్: సస్పెన్స్ అదిరిపోయింది

విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలు పోషించిన ‘దృశ్యం-2’ సినిమా ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. మలయాళం మూవీ దృశ్యం-2 మూవీకి ఇది రీమేక్‌గా తెరకెక్కింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రాగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా సస్పెన్స్ అంశాలతో ఆకట్టుకుంటోంది. పోలీస్ ఆఫీసర్ కుమారుడు వరుణ్ హత్య తర్వాత ఏమైందనే కథ చుట్టూ ఈ సినిమాను తెరకెక్కించారు. రాంబాబు సినిమా థియేటర్ కట్టుకుని హాయిగా జీవిస్తున్న తరుణంలో మళ్లీ వరుణ్ హత్యకు సంబంధించిన అంశాలు తెరపైకి వస్తాయి. ఫస్ట్ పార్టులో రాంబాబు దాచిఉంచిన డెడ్ బాడీని సీక్వెల్‌లో బయటకు తీసినట్లు చూపిస్తున్నారు.

Read Also: నాగ చైతన్యపై రివెంజ్.. సమంత మరో సంచలన నిర్ణయం

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌ పతాకంపై జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నరేష్, నదియా, కృతిక, ఎస్తేర్, సంపత్ రాజ్, వినయ్ వర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళ వెర్షన్ కూడా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలోనే విడుదలవుతోంది. నవంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో దృశ్యం-2 మూవీ స్ట్రీమింగ్ కానుంది.

Related Articles

Latest Articles