వీహెచ్ కు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్..

మాజీ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షులు వీహెచ్ ను ఫోన్ చేసి పరామర్శించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అపోలో ఆసుపత్రిలో కిడ్నీ సమస్య తో చికిత్స పొందుతున్న వీహెచ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెకుసుకున్నారు. డాక్టర్ల సలహాలు ఖచ్చితంగా పాటించాలని చెప్పిన వెంకయ్య నాయుడు… ఆరోగ్యం కోలుకుని తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని తెలిపారు. అయితే తనను గుర్తు పెట్టుకొని పరామర్శించిన వెంకయ్యకు ధన్యవాదాలు తెలిపారు వీహెచ్. అలాగే మీ పరమర్శతో నాకు చాలా ఉత్సాహం వచ్చిందని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-