8 ఐసీసీ టోర్నమెంట్లకు వేదికలు ఖరారు

క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది ఐసీసీ. 2024 నుంచి 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికలను ప్రకటించింది. 14 దేశాల్లో ఈ టోర్నమెంట్లు జరుగనున్నాయి. 2024 టీ 20 వరల్డ్‌ కప్‌ యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ లో జరుగనుంది. 2025 చాంపియన్‌ ట్రోపికి పాకిస్తాన్‌ వేదిక కానుంది.

అలాగే… 2026 టీ20 వరల్డ్‌ కప్‌ ఇండియా, శ్రీలంక లో జరుగనుంది. ఇక 2027 వరల్డ్‌ కప్‌ కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలు కానున్నాయి. అలాగే… 2028 టీ20 వరల్డ్‌ కప్‌ ఆసీస్‌, న్యూజిలాండ్‌ దేశాలు వేదికలు కానున్నాయి. 2029 లో చాంపియన్‌ ట్రోఫికి ఇండియా వేదిక కానుంది. 2030 టీ 20 వరల్డ్‌ కప్‌కు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ లు వేదికలు కానున్నాయి. 2031 వరల్డ్‌ కప్‌ కు ఇండియా, బంగ్లా దేశ్ దేశాలు వేదికలు కానున్నాయి.

Related Articles

Latest Articles