వెంకీ కుడుములకు దానయ్య మెగా ఛాన్స్

ఆ డైరెక్టర్ చేసింది రెండు సినిమాలు. రెండూ హిట్స్. దీంతో తంతే బూరెల బుట్టలో పడ్డట్టు మెగా ఛాన్స్ పట్టేశాడు. ఆ దర్శకుడే వెంకీ కుడుముల. నాగశౌర్య హీరోగా తొలి చిత్రంగా ‘ఛలో’ తీసి సక్సెస్ కొట్టిన వెంకీ ఆ తర్వాత నితిన్ తో ‘భీష్మ’ రూపొందించి మరో హిట్ కొట్టాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే మెగాఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని దర్శకత్వం వహించే ఛాన్స్ పట్టేశాడు.

Read Also : రేపే హిందీ ‘జెర్సీ’ ట్రైలర్

ఈ సినిమాను ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నాడు. ఆయనే వెంకీని మెగాస్టార్ వద్దకు తీసుకు వెళ్ళి స్క్రిప్ట్ వినిపించి ప్రాజెక్ట్ ఓకె చేయించారట. ప్రస్తుతం చిరంజీవి నటించి ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’, బాబీ ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలు చేస్తున్నారు. అవి పూర్తి కాగానే వెంకీ ప్రాజెక్ట్ ఆరంభం అవుతుంది. మరి వెంకీ కుడుముల అప్పటివరకూ ఆగుతాడా? ఈ లోగా వేరే చిన్న ప్రాజెక్ట్ ఏదైనా పూర్తిచేసుకుని వస్తాడా? అన్నది తేలాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Related Articles

Latest Articles