వెంకీ తాతగా మారిపోయిన ‘వెంకీ మామ’!

విక్టరీ వెంకటేశ్ కు షష్ఠి పూర్తి అయ్యింది. అయినా యంగ్ ఛార్మ్ తగ్గకపోవడంతో హీరోగా రాణిస్తూనే ఉన్నారు. మరీ కాలేజీ స్టూడెంట్ పాత్రలు చేయకపోయినా… తన వయసును దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ మ్యాన్ పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేశ్ పిల్లలు సినిమా వాతావరణానికి దూరంగా ఉంటారు. ఆయన కుమార్తె ఆశ్రిత వరల్డ్ ఫేమస్ వంటలు చేయడంలో దిట్ట. ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తోందామె. తరచూ అందులో సరికొత్త వంటల వివరాలు అప్ లోడ్ చేస్తుంటారు.

తాజాగా ఆశ్రిత చాక్లెట్ యూనికార్న్ ఫడ్జ్ ను తయారు చేశారు. అయితే ఈ ప్రాసెస్ లో ఓ చిన్నారిని తనతో పాటు పక్కనే పెట్టుకుని ఆశ్రిత ఈ డిష్ ను చేసింది. ఈ స్పెషల్ డిష్ పూర్తయ్యే సరికీ దాని టేస్ట్ చూడటానికి విక్టరీ వెంకటేశ్ వచ్చారు. కూతురు, కూతురుతో పాటు ఉన్న చిన్నారినీ కూడా అప్రిషియేట్ చేసి, ఆ స్వీట్ ను ఎంచక్కా ఆస్వాదించారు వెంకటేశ్.

విశేషం ఏమంటే… ఆయన ఈ వీడియోలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండీ ఈ చిన్నారి ‘వెంకీ తాత… వెంకీ తాత’ అని సంబోధిస్తూ ఉంది. తెలుగు సినిమా జనాల ముందుకు ఆ మధ్య ‘వెంకీ మామ’గా వచ్చిన వెంకటేశ్ ఇప్పుడు ‘వెంకీ తాత’గా మారిపోయారు. ఇంతకూ ఆ పాలబుగ్గల చిన్నారి ఎవరూ అంటే… రానా సోదరి, మాళవిక దగ్గుబాటి కుమార్తె అని తెలిసింది. సురేశ్ బాబు మనవరాలు అంటే వెంకటేశ్ కూ గ్రాండ్ డాటరే కదా! అందుకే ముద్దుముద్దుగా ‘వెంకీ తాతా’ అంటూ ఆ చిన్నారి విక్టరీ వెంకటేశ్ ను సంబోధించిందన్న మాట!

Related Articles

Latest Articles

-Advertisement-