వెంకీ నెక్స్ట్ “కేర్ ఆఫ్ కాంచరపాలెం” డైరెక్టర్ తో…?

విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సీనియర్ హీరో అయినప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వెంకటేష్ హీరోగా నటించిన మూడు విభిన్న జోనర్ చిత్రాలు నారప్ప, దృశ్యం-2, ఎఫ్-3 చిత్రాల విడుదల గురించి ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రశంసలు పొందిన మలయాళ థ్రిల్లర్ “దృశ్యం-2” తెలుగు రీమేక్ అదే టైటిల్ తో తెలుగులో రూపొందుతోంది. ఈ చిత్రం లాక్డౌన్ పూర్తయిన వెంటనే తెరపైకి రానుంది. నారప్ప, ఎఫ్ 3 చిత్రాలు ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి రానున్నాయి. అయితే తాజాగా ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కూడా వెంకటేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి. కేర్ ఆఫ్ కాంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహాతో వెంకీ ఓ ప్రాజెక్ట్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వెంకటేష్ మహా ఇటీవల ఈ సీనియర్ హీరోను ఒక కథతో మెప్పించాడట. లాక్డౌన్ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు హీరో రాజశేఖర్‌తో కలిసి వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న “మర్మాణువు” చిత్రం ఈ ఏడాది చివర్లో తెరపైకి రానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-