ఆర్ఆర్ఆర్ సైడ్ అవ్వడంతో రేసులోకి వెంకీ

ఇటీవలే ‘నారప్ప’ ను ఓటీటీలోకి తీసుకొచ్చిన విక్టరీ వెంకటేష్.. ఇప్పుడు ‘దృశ్యం 2’ విడుదలపై దృష్టిపెట్టారు. ఈ సినిమా కూడా ఓటీటీలోనే వస్తుందని.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+హాట్ స్టార్ కొనుగోలు చేసిందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సమాచారం మేరకు దృశ్యం 2 థియేటర్లోకి రానుందని తెలుస్తోంది. ఈమేరకు ఓటీటీ డీల్ ను బ్రేక్ చేసారని సమాచారం. ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో దృశ్యం 2 సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ దసరాకి థియేటర్లోనే విడుదల చేయాలనీ నిర్మాతలు సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి భావిస్తున్నారట.. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, షూటింగ్ ను ఎప్పుడో పూర్తిచేసుకొని రెడీగా వుంది.

Related Articles

Latest Articles

-Advertisement-