నెట్ ఫ్లిక్స్ లో బాబాయ్ – అబ్బాయ్ ‘రానా నాయుడు’!

విక్టరీ వెంకటేశ్ సైతం వెబ్ సీరిస్ కు సై అనేశారు. ఇప్పటికే ఆయన ‘నారప్ప’ మూవీ ఓటీటీలో విడుదలైంది. త్వరలో రానాతో కలిసి వెంకటేశ్ నటిస్తున్న ‘రానా నాయుడు’ అనే వెబ్ సీరిస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బుధవారం వెలువడింది. అమెరికన్ పాపులర్ క్రైమ్ డ్రామా ‘రే డొనోవన్’ సీరిస్ ను అడాప్ట్ చేసుకుని ‘రానా నాయుడు’ను నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించింది. గతంలో రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రంలో వెంకటేశ్ అతిథి పాత్రలో అలరించాడు. కానీ ఈసారి ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి ఈ సీరిస్ లో పూర్తి స్థాయిలో నటిస్తుండటం విశేషం. బాబాయ్ వెంకటేశ్ తో కలిసి ఈ వెబ్ సీరిస్ లో నటించడం పట్ల రానా హర్షాన్ని వ్యక్తం చేశాడు. అలానే నెట్ ఫ్లిక్స్ సంస్థ కు తొలిసారి వర్క్ చేయడం కూడా ఆనందంగా ఉందన్నాడు.

Read Also : ఈడీ ముందుకు తరుణ్… విచారణ స్టార్ట్

బాలీవుడ్ లో ఎవరికి ఏ కష్టం వచ్చిన వారి కేరాఫ్ అడ్రస్ ‘రానా నాయుడు’. సో… ఆ పాత్ర చుట్టూనే ఈ వెబ్ సీరిస్ మొత్తం నడుస్తుంది. కరన్ అన్షుమాన్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా, సుపర్న్ వర్మ కో-డైరెక్టర్! అన్న సురేశ్ బాబు కొడుకు రానాతో కలిసి పనిచేయడం పట్ల వెంకటేశ్ సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అమెరికన్ వెబ్ సీరిస్ ‘రే డొనోవన్’ కు తాను గొప్ప అభిమానిని అని, దాని రీమేక్ లో నటించడం ఆసక్తిని కలిగిస్తోందని చెప్పాడు. దీనికి సంబందించిన సమాచారాన్ని వెంకటేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లోకల్ ఫ్లేవర్ తో ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా ఈ వెబ్ సీరిస్ ను రూపొందిస్తున్నామని, ఇటు వెంకటేశ్ – అటు రానా ఇద్దరూ పవర్ హౌస్ పెర్ఫార్మెన్స్ ఇస్తారనే నమ్మకం ఉందని లోకోమోటివ్ గోబ్లల్ కు చెండిన సుందర్ ఆరుణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

-Advertisement-నెట్ ఫ్లిక్స్ లో బాబాయ్ - అబ్బాయ్ 'రానా నాయుడు'!

Related Articles

Latest Articles