ట‌మోటా మాత్ర‌మే కాదు ఇవికూడా మోతే…

ఏపీలో భారీ వ‌ర్షాల కార‌ణంగా ట‌మోటాల ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి.  ఇప్ప‌టికే పెట్రోల్ ధ‌ర‌లు వంద దాటిపోగా ఇప్పుడు ట‌మోటాల ధ‌ర‌లు కూడా వంద దాటిపోయాయి.  ఆసియాలోనే అతిపెద్ద ట‌మోటా మార్కెట్ అయిన మ‌ద‌న‌ప‌ల్లిలో కిలో ట‌మోటా ధ‌ర ఏకంగా రూ. 130 ప‌లుకుతున్న‌ది.  వి.కోట మార్కెట్లో 10 కేజీల ట‌మోటాలు రూ.1500 ప‌లుకుతున్నాయి.  భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో పంట పాడైపోవ‌డంతో ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి.  వ‌ర్షాలు తగ్గి, వ‌ర‌ద ఉధృతి పూర్తిగా తగ్గి మ‌ళ్లీ కొత్త పంట వ‌స్తేనే ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ది.

Read: జ‌న‌ర‌ల్ నాలెడ్జీ తెలిస్తే చాలు… ఆ ఆటోలో ఫ్రీగా ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు…

ట‌మోటా మాత్ర‌మే కాదు, మార్కెట్‌లో ఏ కూర‌గాయ‌న ధ‌ర‌లు తీసుకున్నా మోత మోగుతున్నాయి.  బెండ‌కాయి, కాక‌ర‌కాయి, మిర్చి, బీర‌కాయి కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి.  అటు ఆకుకూర‌ల ధ‌ర‌లు సైతం అమాంతంగా పెర‌గ‌డంతో వినియోగ‌దారులు ఆకుకూర‌లు కొనాలంటే భ‌య‌ప‌డుతున్నారు.  కూర‌గాయ‌ల కోసం సాధార‌ణంగా వినియోగించే బ‌డ్జెట్‌కు రెండింత‌ల బ‌డ్జెట్‌ను కేటాయించాల్సి వ‌స్తోంద‌ని సామాన్య ప్ర‌జ‌లు వాపోతున్నారు.  

Related Articles

Latest Articles