యువకుడి ప్రాణం తీసిన కోడి పందాలు

సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు కోడి పందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు జోరుగా కొనసాగుతాయి. అయితే కోడి పందాలు సంప్రదాయ బద్ధంగానే నిర్వహించాలని కోర్టులు చెప్పిన కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. భీమవరం, ఉంది, వెంప, దెందులూరు, తణుకు, అమలాపురం, రావులపాలెంలో భారీగా తమ కోడి పందాలు జరిగాయి.

Read Also: వైసీపీ ఎంపీకి సైబర్ చీటర్ ఝలక్‌

అయితే ప్రజాప్రతినిధుల సమక్షంలోనే కోడిపందాల నిర్వహణ జరుగుతుండటంతో అటు పోలీసులు సైతం వీరిని నిలువరించే ప్రయత్నాలు చేసినా.. అవేవి జరగటం లేదు. ఇదిలా ఉంటే మరో వైపు కోడి పందాల్లో కోట్ల రూపాయాలు చేతులు మారే అవకాశాలు ఉన్నాయి. ఈ పందాలే ఓ నిండు యువకుడి ప్రాణాన్ని బలిగొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలానికి చెందిన వీర్రాజు పెన్నాడలో కోడి పందాల్లో పాల్గొన్నాడు. వరుసగా మూడు పందాలు ఓడిపోయిన వీర్రాజు బరి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో తీవ్ర గుండెపోటు రావడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related Articles

Latest Articles