వ‌రుణ్ గాంధీ, సింధియాలకు కేంద్ర ప‌ద‌వులు..?

దేశంలో రాజ‌కీయ ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి.  త్వ‌ర‌లోనే ఏడు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న తరుణంలో కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేయ‌బోతున్నారు.  పార్టీలోని కొంత మంది సీనియ‌ర్ల‌కు, స్థాన‌చ‌ల‌నం ఉండే అవ‌కాశం ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.  కొత్త‌గా కొంత‌మందికి కేబినెట్‌లో చోటు క‌ల్పించే దిశ‌గా కేంద్రం ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంటోంది.  కేంద్ర మంత్రివ‌ర్గంలోకి అస్సాంకు చెందిన స‌ర్వానంద్ బిస్వాల్‌, బీహార్‌కు చెందిన సుశీల్ కుమార్ మోడీ, వ‌రుణ్ గాంధీ, జ్యోతిరాధిత్యా సింధియా, అనుప్రియా ప‌టేల్ వంటి వారికి మంత్రి ప‌ద‌వులు ల‌భించే అవ‌కాశం ఉన్న‌ది.  

Read: ‘బంగార్రాజు’లో సీనియర్ నటి!

అదే విధంగా కొంత‌మందిని కేంద్ర‌మంత్రులుగా ప‌క్కుకు త‌ప్పించి వార‌కి పార్టీ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టాల‌ని చూస్తున్నారు.  ప్ర‌స్తుతం కేంద్ర‌మంత్రిగా ఉన్న ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌ను పక్క‌కు త‌ప్పించి త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించాల‌ని చూస్తున్నారు.  గ‌తంలో ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌కు న్యాయ‌స‌ల‌హాదారుడిగా ప‌నిచేశారు.  ఆ రాష్ట్రంలోని నేతల‌తో స‌న్నిహిత సంబందాలు ఉన్నాయి.  ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌దవిని అప్ప‌గిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-