అంతర్జాతీయ డిజిటల్ సిరీస్‌ లో వరుణ్ ధావన్!?

అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారూఖ్ ఖాన్ వంటి పలువురు బాలీవుడ్ బడా స్టార్స్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా చేరాడు. ఇది అతనికి అతని అభిమానులకు బిగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇతగాడు ఎంట్రీ ఇవ్వబోతోంది ఓ అంతర్జాతీయ డిజిటల్ సీరీస్ తో. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కాబోయే ఓ అంతర్జాతీయ సిరీస్ కోసం సైన్ చేశాడు వరుణ్‌. ఆ సీరీస్ పేరు ‘సిటాడెల్‌’. ఆంథోనీతో కలసి జో రస్సో సృష్టించిన అమెరికన్ డ్రామా సిరీస్ ఇది. రస్సో బ్రదర్స్ పేరు వినగానే మనకు మార్వెల్ స్టూడియోలో తీసిన ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ తో పాటు ఎవెంజర్స్: ఎండ్‌గేమ్‌ వంటి సినిమాలు గుర్తుకు రాక మానవు.

Read Also : ‘స్వాతిముత్యం’ గా బెల్లంకొండ గణేష్

ఇక ‘సిటాడెల్’ విషయానికి వస్తే ఇదో యాక్షన్ అడ్వెంచర్ స్పై సిరీస్. ఇందులో భాగంగా ‘మదర్‌షిప్ సిరీస్’తో పాటు స్థానిక భాషలలో ‘శాటిలైట్ సిరీస్’ ఉంటాయి. మెయిన్ సిరీస్‌లో ప్రియాంక చోప్రా మరియు రిచర్డ్ మాడెన్ ఉంటారు. ఇంగ్లాండ్ లో దీని షూటింగ్ ప్రారంభమైంది. ‘ద ఫ్యామిలీ మేన్’ ఫేమ్ రాజ్ నిడిమోరు- కృష్ణ డికె దర్శకత్వం వహించనున్న ‘శాటిలైట్ సిరీస్‌’లో వరుణ్ ప్రధాన పాత్ర పోషించబోతున్నాడు. ‘సిటాడెల్’ ను ఇండియా, మెక్సికో, ఇటలీలో తీయనున్నారు. మెయిన్ సిరీస్ జనవరి 2022లో ఆన్‌లైన్‌లో ప్రసారం కానుంది. యువతరం హీరోల్లో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్న వరుణ్‌ కి ఆల్ ద బెస్ట్ చెబుదామా..!

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-