దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ… ఎడారిలో ఐస్ తయారు చేసినట్టే !

యంగ్ హీరో నాగశౌర్య రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను”. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్ పాత్రల పోషిస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. క్లీన్ కుటుంబ కథా చిత్రమైన “వరుడు కావలెను” సినిమా నుంచి మేకర్స్ తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

Read Also : సూపర్ స్టార్ ఫ్యామిలీలో మరో ప్రిన్స్… గౌతమ్ బర్త్ డే

టీజర్లో హీరోయిన్ హావభావాలు, డైలాగ్స్, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, ముఖ్యంగా వెన్నెల కిషోర్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీజర్ చివర్లో వచ్చిన “ఎవ్రీ బాల్ సిక్స్ కొట్టే ఆటగాడిని చూశావా ? మావాడు అలాంటి వాడే” అని హీరో ఫ్రెండ్ అనగా… “ప్రతీ బాల్ ను నో బాల్ ఇచ్చే అంపైర్ ను చూశావా ? ఆ అమ్మాయి అలాంటిదే” అంటూ వెన్నెల కిషోర్ వేసిన పంచ్ హిలేరియస్ గా ఉంది.

కాగా కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన ఓ లిరికల్ సాంగ్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. శ్రేయ ఘోషల్ పాడిన “దిగు దిగు నాగన్న” సాంగ్ పై హిందూవాదులు మండిపడ్డారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Related Articles

Latest Articles

-Advertisement-