జూ. ఎన్టీఆర్ పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

అమరావతి : జూనియర్‌ ఎన్టీఆర్‌ పై తెలుగు దేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యుల వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 12 గంటల పాటు భార్యతో కలిసి తన నివాసంలో నిరసన చేపడుతున్నారు వర్ల రామయ్య. అయితే… ఈ సందర్బంగా వర్ల రామయ్య మాట్లాడుతూ…. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించిన తీరు సరిగా లేదన్నారు.

భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీఆర్‌ విఫమయ్యారని చురకలు అంటించారు. మేనత్తను నొటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని… ఈ విషయాన్ని ప్రజలే అనుకుంటున్నారని మండిపడ్డారు వర్ల రామయ్య. సినిమాల కోసం కుటుంబాన్ని నైతిక విలువలను వదులుకుంటారా అని ప్రశ్నించారు వర్ల. అటు బుద్దా వెంకన్న కూడా ఎన్టీఆర్‌పై కామెంట్స్‌ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రిలాగానో, ఆదిలాగానో స్పందిస్తాడనుకున్నామని… చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు జూనియర్ చెప్పారని ఎద్దేవా చేశారు.
జూనియర్ స్పందన చూసి టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారని మండిపడ్డారు.

Related Articles

Latest Articles