మాస్క్ తో మన ప్రయోగాలు… స్టార్స్ ఫన్నీ వీడియో

కరోనా మహమ్మారి కారణంగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకోవడం అనేది మానవ జీవితాల్లో రోజూవారీ దినచర్యగా మారిపోయింది. కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది ఇప్పటికి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో ఈ మహమ్మారి అత్యంత్య వేగంగా వ్యాపిస్తూ ఉండడం, రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండడంతో దేశం మొత్తం వణికిపోయింది. అంతేనా మరోమారు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ దిశగా నిర్ణయం తీసుకునేలా చేసింది. ప్రస్తుతం కొంత వరకు కేసులు తగ్గాయి. అయితే గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఇంత జరుగుతున్నా, ఎంతోమంది కరోనా జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొంతమంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి వల్ల వారికే కాకుండా వారి చుట్టు పక్కల ఉండే ప్రజలకు కూడా ప్రమాదం. అంతేకాదు మరిన్ని కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. అయితే తాజాగా సౌత్ సెలెబ్రిటీలు మాస్క్ తో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు చేసే ప్రయోగాలను ఫన్నీ గా చూపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో చివరగా అసలు మాస్కును ఎలా ధరించాలో కూడా చూపించారు. ఈ వీడియోలో వరలక్ష్మి శరత్ కుమార్, ఐశ్వర్య రాజేష్, రెజీనా కాసాండ్రా, సందీప్ కిషన్, కృష్ణ, సతీష్, ప్రియదర్శి, యోగిబాబు, విద్యురామన్ తదితరులు కన్పించారు. వరలక్ష్మి ఈ వీడియోను పోస్ట్ చేస్తూ తాను అడగ్గానే సహకరించిన సెలెబ్రిటీలు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-