ఖమ్మం జిల్లా జైలుకు వనమా రాఘవ తరలింపు

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు నిందితుడు వనమా రాఘవను జిల్లా జైలుకు తరలించారు. భద్రాచలం ప్రత్యేక సబ్‌ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాఘవను. భద్రతా కారణాల రీత్యా కోర్టు ఆదేశాల మేరకు ఖమ్మం తరలించామని అధికారులు చెబుతున్నారు. అయితే రాఘవ తరలింపును గోప్యంగా ఉంచారని ఆరోపణలు వస్తున్నాయి. కాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రాఘవను రిమాండ్ విధించింది.

Read Also: గాంధీ ఆస్పత్రికి రాష్ర్ట ప్రభుత్వం కీలక ఆదేశాలు

అయితే వనమా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వనమా రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నారు. తన తండ్రి అధికారం మాటున షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ అరాచకాలకు పాల్పడ్డారనికొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో రాఘవ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సెటిల్‌మెంట్ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపించారు. తన మాట వినని వారిపై రాఘవ దాడులు చేయించడం, పోలీసు కేసులు పెట్టించడం వంటి చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు.

Related Articles

Latest Articles