విజయ్ తో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసిన వంశీ పైడిపల్లి

తలపతి విజయ్, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనుంది అనే వార్త గతకొంతకాలంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే వంశీ తన కథను స్టోరీని విజయ్ కు వివరించి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడని, విజయ్ కూడా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కోసం వంశీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను రాస్తున్నట్లు, కథలో ఎమోషన్స్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయనే వార్తలు విన్పించాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా వంశీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడంతో సినిమాపై ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది. ఓ ఇంటర్వ్యూలో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ తలపతి విజయ్, దిల్ రాజు కాంబోలో సినిమా ఉందని, ఆ భారీ ప్రాజెక్ట్ ను కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో విజయ్-వంశీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉందనే విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అధికారిక ప్రకటన మాత్రమే బ్యాలన్స్ ఉంది. తెలుగులో విజయ్ కు ఇదే మొదటి స్ట్రయిట్ చిత్రం కావడం విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-