హైకోర్టులో నేడు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణ…

హైకోర్టులో నేడు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణ జరిగింది. ఫిబ్రవరి 17న రామగిరి మండలం కల్వచర్ల వద్ద ప్రధాన రహదారిపై వామన్ రావు దంపతుల హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పటికే 7 నిందితులను అరెస్ట్ చేసారు. వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన రెండో ఫిర్యాదు పైన మరోసారి విచారణ చేపట్టిన పోలీసులు… మే 20న నా అభియోగ పత్రాలు మంథని కోర్టులో దాఖలు చేసారు. ఏప్రిల్ 23న హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో కేసు విచారణ పూర్తి నివేదికను 15 రోజుల్లో కోర్టుకు అప్పగిస్తామని మాట ఇచ్చిన పోలీసులు కేసు విచారణ నివేదికను నేడు కోర్టులో సమర్పించనున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి హైకోర్టుకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ అంశం కూడా చర్చకు రానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-