అజిత్ అభిమాలకు గుడ్ న్యూస్… డబుల్ ట్రీట్…!!

కోలీవుడ్ స్టార్ హీరో, తల అజిత్ కు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టార్ హీరో తరువాత సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ‘వాలిమై’ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకముందే సోషల్ మీడియాలో పలు హ్యాష్ ట్యాగ్ లతో హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు అజిత్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ‘తల’ అభిమానులు ఎగిరి గంతేసే అప్డేట్ వచ్చింది. ట్విట్టర్‌లో “వీ వాంట్‌ వాలిమై అప్‌డేట్” హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులు చాలా కాలంగా అప్‌డేట్ కావాలని అడుగుతున్నారు. అయితే మొత్తానికి ఆ సమయం రానే వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ అజిత అభిమానుల కోసం డబుల్ ట్రీట్ ను సిద్ధం చేస్తున్నారట.

Read Also : చెన్నై చేరిన బుట్టబొమ్మ… పిక్స్ వైరల్

‘వాలిమై’ ఫస్ట్ లుక్‌తో పాటు, మోషన్ పోస్టర్ విడుదల తేదీని కూడా ప్రకటించబోతున్నారట. ఈ బిగ్ అప్డేట్ జూలై మధ్యలో రానుందని తెలుస్తోంది. ‘వాలిమై’ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇందులో ప్రేక్షకులను అబ్బురపరిచే స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి అజిత్ మునుపటి చిత్రం ‘నెర్కొండ పార్వై’కి దర్శకత్వం వహించిన హెచ్. వినోత్ దర్శకత్వం వహించారు. ఇది బాలీవుడ్ చిత్రం ‘పింక్’ తమిళ రీమేక్. ‘వాలిమై’లో హీరోయిన్ గా హుమా ఖురేషి, విలన్ గా కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్నారు. ఇంతకు ముందు ఈ చిత్రాన్ని 2021 దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ కరోనావైరస్ మహమ్మారి కారణంగా సినిమా విడుదలలో జాప్యం జరుగుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-