సక్సెస్ ఫుల్ గా “వాలిమై” షూటింగ్ పూర్తి

తల అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “వాలిమై”. ఈ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అజిత్ పవర్ ఫుల్ పోలీసు పాత్రను పోషిస్తున్నాడు. ఈ యాక్షన్ మూవీ సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా కోలీవుడ్ అంతా ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రీసెంట్ గా రష్యాలో జరిగిన ఫైనల్ షెడ్యూల్ లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. కరోనా సమయంలోనూ ఎలాంటి అడ్డంకులు, ఆటంకం లేకుండా సినిమాను విజయవంతంగా పూర్తి చేశారు మేకర్స్. ప్రస్తుతం టీం సినిమాకు గుమ్మడికాయ కొట్టేసి చెన్నైకి తిరుగు ప్రయాణమైందని సమాచారం. ఇక నెక్స్ట్ రాబోయే అప్డేట్ సినిమా రిలీజ్ డేట్ అనేది లేటెస్ట్ అప్డేట్. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారట “వాలిమై” మేకర్స్.

Read Also : “హరి హర వీర మల్లు” అప్డేట్ అదిరింది !

కొన్ని వారాల క్రితం ఈ చిత్రంలో నుంచి విఘ్నేష్ శివన్ రాసిన ‘నాంగ వెర మారి’ అనే మొదటి సింగిల్ విడుదలైంది. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్, ఎల్ఎల్పి బ్యానర్‌లో “వాలిమై” తెరకెక్కుతోంది. 2019లో కోర్ట్ డ్రామా ‘నేరకొండ పార్వై’ అజిత్, వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న రెండవ చిత్రమిది. ‘వాలిమై’ చిత్రంలో హ్యూమా ఖురేషి, పెర్లే మానే, యోగి బాబు, కార్తికేయ గుమ్మకొండ నటించారు. సంగీతం యువన్ శంకర్ రాజా స్వరపరచగా, కెమెరా డిఓపి నిరవ్ షా అందించారు.

Related Articles

Latest Articles

-Advertisement-