అల్లుడిని వెనక్కు నెట్టిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అల్లుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను వెనక్కి నెట్టేశారు. గతంలో అల్లు అర్జున్ నెలకొల్పిన రికార్డును పవన్ బ్రేక్ చేయడం విశేషం. ఆయన నటించిన “వకీల్ సాబ్” చిత్రం బుల్లితెరపై సరికొత్త రికార్డును నెలకొల్పింది. పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” జూలై 18న వరల్డ్ టీవీ ప్రీమియర్ చేయబడింది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించిన ‘వకీల్ సాబ్’ టీఆర్పీ పరంగా సెన్సేషన్ సృష్టించింది. ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు టెలివిజన్ ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన ‘పింక్’ అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు.

Read Also : ఓటీటీలోనే నయనతార ‘నెట్రికన్’

బిగ్ స్క్రీన్స్ పై బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టిన “వకీల్ సాబ్” ఇప్పుడు బుల్లితెరపై కూడా ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. ఈ సినిమాకు ఏకంగా టిఆర్పి రేటింగ్ 32.20 రావడం విశేషం. దీనితో అంతకుముందు నెలకొన్న రికార్డులన్నీ బ్రేక్ అయినట్టే. గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన “అల వైకుంఠపురంలో” చిత్రానికి టెలివిజన్ లో 29.4 రేటింగ్ వచ్చింది. దీంతో అల్లుడి రికార్డునే పవన్ బ్రేక్ చేసినట్టయ్యింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-