మే నెలాఖరుకే ఓటీటీలో ‘వకీల్ సాబ్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలై చక్కటి ఆదరణ పొందింది. కోవిడ్ సెకండ్ వేవ్ తో ప్రేక్షకులు థియేటర్లకు అంతగా రావటం లేదు. దీంతో చాలా వరకు థియేటర్లను మూసి వేశారు. దీంతో చాలా సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయి. ‘వకీల్ సాబ్’ కూడా ఓటీటీలో వస్తే మళ్ళీ చూడాలని పలువురు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. దాంతో మే 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వస్తుందని టాక్ మొదలయ్యింది. అయితే ఇది నిజం కాదు. నిర్మాత దిల్ రాజు 50 రోజుల రన్ పూర్తి అయిన తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధన విధించారు. ఈ మేరకు మే నెలాఖరులోనే స్ట్రీమింగ్ కు రానుంది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, నివేతా థామస్, అంజలి కీలక పాత్రలు పోషించగా పవన్ కి జోడీగా శ్రుతిహాసన్ కనిపించింది. ప్రకాష్ రాజ్ లాయర్ గా ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-