ఓటిటిలో ‘వకీల్ సాబ్’… దిల్ రాజుకు అదనంగా 12 కోట్లు…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ‘వకీల్ సాబ్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కు అమెజాన్ ప్రైమ్ ముందుగా 14 కోట్ల రూపాయలను చెల్లించింది. అయితే తాజాగా అమెజాన్ సంస్థ దిల్ రాజుకు మరో 12 కోట్లు అదనంగా చెల్లించినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన తరువాత యాభై రోజుల వరకూ ఏ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అవ్వకూడదు అన్నది నిబంధన. అయితే అమెజాన్ వారు మాత్రం ‘వకీల్ సాబ్’ను 50 రోజుల కన్నా ముందే స్ట్రీమింగ్ చేసేందుకు దిల్ రాజు తో ఒప్పందం కుదుర్చుకున్నారట. అందుకు గానూ దిల్ రాజు 12 కోట్లు అదనంగా డిమాండ్ చేశారట. అంటే ఇంతకుముందు రైట్స్ కు 14 కోట్లు, ఇప్పుడు 20 రోజుల్లోనే స్ట్రీమింగ్ చేసేందుకు గానూ అదనంగా 12 కోట్లు చెల్లించిందట అమెజాన్. మొత్తం కలిపి 26 కోట్లు అన్నమాట. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూసి వేయడంతోనే 20 రోజుల్లో సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసుకోవడానికి దిల్ రాజు అంగీకరించారట.

కాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలై చక్కటి ఆదరణ పొందింది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, నివేతా థామస్, అంజలి కీలక పాత్రలు పోషించగా పవన్ కి జోడీగా శృతి హాసన్ కనిపించింది. ప్రకాష్ రాజ్ లాయర్ గా ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-