తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు..

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైకుంట ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ భక్తులు విచ్చేశారు. రాజకీయ, సీని ప్రముఖులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 1.45 గంటలకే స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. అయితే 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారా దర్శనం కొనసాగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణలో సైతం ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంది.

వేకువజామునుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి బ్రేక్‌ పడింది. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో కరోనా నిబంధనలు విధించారు. ఏకాంతసేవ, పల్లకి సేవలకు, స్వామి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. సింహాచలం దేవస్థానంలో శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి వారు తొలిపూజ నిర్వహించారు.

Related Articles

Latest Articles