వ్యాక్సినేషన్‌.. ఐసీఎంఆర్ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు..

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పటి వరకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌… దీంతో.. క్రమంగా అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి.. భారత్‌లో కూడా ఈ ప్రక్రియ సాధ్యమైనంత వేగంగా ముందుకు సాగేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.. వ్యాక్సిన్లపై కూడా ఇప్పటికే పలు అధ్యయనాలు జరగగా.. తాజాగా.. వ్యాక్సినేషన్‌పై ఐసీఎంఆర్ ఆసక్తికర విషయాలను తన అధ్యయనంలో వెల్లడించింది.. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కోవిడ్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై ఐసీఎంఆర్‌ అధ్యయనం నిర్వహించగా.. అది ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలను తగ్గించడంలో గణనీయమైన పనితీరు చూపినట్టు వెల్లడించింది..

కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోనన సమయంలో నిర్వహించిన ఈ అధ్యయనం దేశంలోనే మొదటిది, అతిపెద్దది కూడా అని చెబుతోంది ఐసీఎంఆర్.. దేశవ్యాప్తంగా 677 కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులపు అధ్యయనం నిర్వహించింది.. ఇక, ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికరమైన అంశాలను గమనిస్తే.. ఫస్ట్‌ డోస్ లేదా ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ డోసుల టీకా తీసుకున్న తర్వాత కరోనా బారినపడిన వ్యక్తులపై ఈ అధ్యయనం నిర్వహించారు.. వారి నమూనాలను సేకరించి విశ్లేషించింది ఐసీఎంఆర్.. మొత్తంగా 677 మంది నమూనాలను విశ్లేషించగా.. అందులో 86.09 శాతం డెల్టా వేరియంట్‌ను గుర్తించారు.. అయితే.. వారిలో 9.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందని.. 0.4 శాతం మరణాలు మాత్రమే సంభవించాయని పేర్కొంది.. అంటే.. వ్యాక్సిన్‌ తీసుకున్నవారు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితిని తగ్గించిందని.. మరణాలు కూడా తగ్గాయని పేర్కొంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-