నరేశ్ కు మానవత్వం లేదన్న ఉత్తేజ్!

‘మా’కు జరిగిన ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన ఉత్తేజ్ తనను గెలిపించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తన భార్య పద్మ చనిపోయిన కారణంగా తాను ఎవరినీ ఓటు అడగలేదని, కానీ తన మీద ప్రేమతో మూడు వందల మంది ఓటు వేసి తనను జాయింట్ సెక్రటరీగా గెలిపించారని ఉత్తేజ్ అన్నాడు. బల్బ్ ను కనుగొన్న థామస్ ఆల్వ ఎడిసన్, సినిమాను ఇచ్చిన లూమియర్ బ్రదర్స్, ‘మాయాబజార్’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన మార్కస్ బాట్లే వీరెవ్వరూ లోకల్ కాదని, సినిమా అన్న పదమే లోకల్ కాదని ఉత్తేజ్ అన్నాడు.

అయినా ప్రకాశ్ రాజ్ ఓ గొప్ప విజన్ తో ‘మా’ను ముందుకు తీసుకెళ్ళాలని, సభ్యులకు సాయం చేయాలని కలలు కన్నారని కానీ ఆయన్ని అకారణంగా ఓడించారని వాపోయాడు. ఇదే సమయంలో గత కార్యవర్గంలో తాను శివాజీరాజా ప్యానెల్ నుండి ఇసీ మెంబర్ గా గెలిచి, ‘మా’లో ఎన్నో అవమానాలు పొందానని చెప్పారు. నరేశ్ ప్రవర్తన చాలా అహంకారపూరితంగా ఉండేదని, అధ్యక్షుడిగా తానేమైనా చేయొచ్చన్నట్టు వ్యవహరించే వారని చెప్పారు. తన భార్య చనిపోతే, ఎంతోమంది సినిమా పెద్దలు తనను ఆ రోజు పరామర్శించారని కానీ ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న నరేశ్ మాత్రం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదని, ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడినే ఓదార్చని వ్యక్తి ‘మా’ సభ్యులను పట్టించుకుంటాడని అనుకోవడమంత మూర్ఖత్వం ఇంకోటి లేదని ఉత్తేజ్ అన్నాడు.

-Advertisement-నరేశ్ కు మానవత్వం లేదన్న ఉత్తేజ్!

Related Articles

Latest Articles