యూపీలో స్కూళ్లు మూసివేత‌… నైట్ క‌ర్ఫ్యూ మ‌రో రెండు గంట‌లు పొడిగింపు…

యూపీలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా యోగి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  జ‌న‌వ‌రి 6 వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 14 వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది.  యూపీలో యాక్టీవ్ కేసులు 3 వేలు దాట‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  అంతేకాకుండా నైట్ క‌ర్ఫ్యూ స‌మ‌యాన్ని కూడా ప్ర‌భుత్వం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు అమ‌లులో ఉన్న క‌ర్ఫ్యూను మ‌రో రెండు గంట‌లు పొడిగించింది.  రాట్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.  యాక్టీవ్ కేసులు వెయ్యి దాటిన స‌మ‌యంలో యూపీలో నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేయ‌డం మొద‌లుపెట్టారు.  కాగా, యాక్టీవ్ కేసుల సంఖ్య మూడు వేల‌కు చేర‌డంతో పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూసే అవ‌కాశం ఉంటుంద‌ని వారం రోజుపాటు సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది.  

Read: లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: జియాంగ్ సిటీలో వ‌స్తుమార్పిడి ప‌ద్ద‌తి…

ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటామ‌ని, థ‌ర్డ్ వేవ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌డానికి అవ‌స‌ర‌మైన అన్నిర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని యూపీ ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.  జ‌న‌వ‌రి 6 నుంచి వివాహాలు, శుభ‌కార్యాలు, ఇత‌ర వేడుక‌ల‌కు 100 మందికి మించి అనుమ‌తించ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ఓపెన్ ప్లేస్‌లో వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తే సీటింగ్ కెపాసిటిని బ‌ట్టి 50 శాతం మందిని మాత్ర‌మే అనుమ‌తించాల‌ని ఆదేశించింది.  త‌ప్ప‌నిస‌రిగా మాస్క్‌ను ధ‌రించాల‌ని, శానిటైజ‌ర్‌ను వినియోగించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.  ప్ర‌స్తుతం యూపీలోని ఏ జిల్లాలోనూ వెయ్యికి పైగా యాక్టీవ్ కేసులు లేవ‌ని, ఒక‌వేళ జిల్లాల్లో వెయ్యికి మించి యాక్టీవ్ కేసులు ఉంటే, జిమ్‌, స్పా, సినిమా హాల్స్‌, రెస్టారెంట్స్, మాల్స్ అన్ని 50 శాతం సీటింగ్‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుందని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.  

Related Articles

Latest Articles