రైతులను ఒప్పించడంలో విఫలమయ్యాం:యోగి ఆదిత్యనాథ్

వ్యవసాయ చట్టాల విషయంలో రైతులను ఒప్పించడంలో విఫలమ య్యామని, వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకు న్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు.ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లా డారు. మూడు వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా రైతులను ఒప్పిం చలేకపోయినందుకు విచాచారం వ్యక్తం చేశారు. సీఎం యోగి ఆదిత్య నాథ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో, ప్రభుత్వం ప్రతి స్థాయిలో రైతులతో చర్చలు జరపడానికి ప్రయత్నించింది. కానీ మా వైపు నుండి కొంత లోపం కారణంగా, మేము చట్టాలను ప్రజలకు వివరించడంలో ఓటమి చెందామన్నారు.

ఈరోజు గురు నానక్‌ జయంతి సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం ద్వారా ప్రధాని చారిత్రాత్మకమైన పని చేశారని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. అయితే, ప్రభుత్వా నికి పెద్ద సంఖ్యలో రైతుల మద్దతు లభించినప్పటికీ, మైనార్టీని ఒప్పించలేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఇలాంటి చట్టాలు కీలకపాత్ర పోషిస్తాయని మొదటి నుంచీ విశ్వసించే పెద్ద సమాజం ఉన్నప్పటికి, కొనని రైతు సంఘాలు వ్యతిరేకించాయన్నారు. మేం ఎంత ప్రయత్నించినా ఆందోళన బాట పట్టాయని సీఎం యోగి అన్నారు.కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి సంబంధించి కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు.

Related Articles

Latest Articles