బీజేపీని అడిగే ధైర్యం కేసీఆర్ కు లేదు…

ఆరున్నర దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆంకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుంది. తెలంగాణ ప్రజల తరపున సోనియా గాంధీ కి ధన్యవాదాలు తెలుపుతున్నా అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏడేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల ఆంకాంక్షకు అనుగుణంగా పాలన సాగడం లేదు. విభజన హామీలను కేంద్రం లోని బీజేపీ ని అడిగే ధైర్యం కేసీఆర్ కు లేదు. కోవిడ్ విషయంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయి. మెడికల్ మౌళిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది. రోమ్ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి పిడేల్ వాయించిన చందంగా కేసీఆర్ తీరు ఉంది. కోవిడ్ ట్రీట్మెంట్ కోసం పక్కనున్న ఏపీ , తమిళనాడు మాదిరిగా అమలు చేయాలని కోరిన పట్టించుకోవడం లేదు. ఏడేళ్ల లో తెలంగాణ సమాజానికి ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదు అని తెలిపారు.

ప్రభుత్వం లో ఉన్న ఖాళీ లను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి రెండున్నర ఏళ్లు గడిచిన స్పందన లేదు. తెలంగాణ ప్రభుత్వం లో అవినీతి తారస్థాయికి చేరింది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు సమిష్టి గా కృషి చేయాలి అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-