కేసీఆర్ కు తెలంగాణ సీఎంగా కొనసాగే హక్కు లేదు : ఉత్తమ్

కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నల్గొండ ఎంపీ , టిపిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ… సోనియాగాంధీ , రాహుల్ గాంధీ ప్రోత్సహంతో తెలంగాణ రాష్టానికి 6 సంవత్సరాలపాటు పిసిసి అధ్యక్షులుగా సేవ చేసే అదృష్టం నాకు కలిగింది. కొన్ని సంవత్సరాలుగా వివిధ పార్టీల వారు మా కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అభినందనలు. ఆంధ్ర లో ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ వారు అక్కడ వారు అలయి బలయి చేసుకున్నారు ఇక్కడి నుంచి డబ్బు కూడా తరలించారు.

నాగార్జున సాగర్ నుంచి 11టిఎంసిల నీరు వృథాగా పోతున్న పట్టించుకోని కేసీఆర్ తెలంగాణ కు ముఖ్యమంత్రి గా కొనసాగే హక్కు ల్లేదు. కాళేశ్వరం నుంచి 3 టిఎంసిల నీటి కోసం తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి ఒక లక్ష 18 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. టిఆర్ఎస్ మరియు బిజిపి పార్టీలు చేసే అవినీతి అక్రమాలపై పార్లమెంట్ లో గట్టిగా ప్రశ్నిస్తాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రేస్ కార్యకర్తకు అందుబాటులో ఉంటాం. పార్టీ లో ఎటువంటి విబేదాలు ల్లేవు అందరం కలిసికట్టుగా పని చేసి 2023 లో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి తీసుకోస్తాం. పల్లె ప్రగతి పేరుతో నిధులు మంజూరు చేకుండా సర్పంచుల ను ఇబ్బందులకు గురి చేస్తూన్నారు అని తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-